విశాలాంధ్ర-తాడిపత్రి : మృతుని కుటుంబానికి ఎన్నారై కిరణ్ కుమార్ ఆర్థిక సహాయం అందించినట్లు బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు చెప్పారు. బుధవారము ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది పేద పిల్లలకు ఎన్నారై కిరణ్ కుమార్ ఆర్థిక సహాయం చేయూత నిచ్చిందన్నారు. అందులో భాగంగానే పట్టణానికి చెందిన పత్రికా విలేకరి ఈశ్వరయ్య కుమారుడు దేవశంకర్ (వాలంటీర్) గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై కిరణ్ కుమార్ తన వంతు సహాయంగా నాయనమ్మ నల్లమ్మకి 5వేలు రూపాయలు అందిచారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు మండల శివ, నందగోపాలు , కంబగిరి పాల్గొన్నారు.