Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

పన్ను వసూళ్లలో జిల్లాలో మొదటి స్థానం, అనంతపురం జిల్లాలో రెండవ స్థానం


విశాలాంధ్ర – ధర్మవరం : 2022-23 ఆర్థిక సంవత్సరపు మున్సిపల్ పన్నులో శ్రీ సత్యసాయి జిల్లాలో మొదటి స్థానం, అనంతపురం జిల్లాతో పోలిస్తే రెండవ స్థానంలో ధర్మవరం మున్సిపాలిటీ కైవసం చేస్తుందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ 31/3/2023 నాటికి ప్రైవేట్ ఆస్తి పన్నులు 8.81 కోట్లు ఉండగా, 8 కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు. ఇందుకుగాను 90.69 శాతము నమోదు కావడం జరిగిందని, చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదని వారు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గాని ,అనంతపురం జిల్లాలో గాని మన ధర్మవరం మున్సిపాలిటీ ఉత్తమ స్థానం కనపరచుటకు అనేక కారణాలు ఉన్నాయని వారు తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడం, పట్టణములోని సచివాలయ వ్యవస్థలలో అడ్మిన్ కార్యదర్శుల సహకారం, వార్డు కౌన్సిలర్ల ప్రోత్సాహ సహకారం, మున్సిపల్ రెవెన్యూ విభాగంలో ఆర్ఐ అధికారితోపాటు సిబ్బంది యొక్క కృషి ఎంతో ఉందని వారు తెలిపారు. ఇక ప్రభుత్వము ప్రైవేట్ పన్నులు ప్రకారం వెళితే శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రథమ స్థానంలో 82.14 శాతము నమోదయిందన్నారు. అనంతపురం జిల్లాతో పోలిస్తే రెండవ స్థానంలో ఉందన్నారు. పట్టణ ప్రజలు కూడా మా సిబ్బందితో సహాయ సహకారాలు అందించడం వలన వచ్చిన ఆదాయంతో పట్టణములోని అభివృద్ధి కార్యక్రమాలను అతి త్వరలోనే చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. పట్టణంలోని వార్డు వైజుగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపా రు. ఇక నీటి పన్నుల వసూలుకు వస్తే 8.6 కోట్లు వసూలు కావలసి ఉండగా 4.54 కోట్లు వసూలు కావడంతో 52.8 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. దీర్ఘకాలిక బకాయిలు, నీటి పన్నులు సకాలంలో చెల్లించినప్పుడే మునిసిపాలిటీ అభివృద్ధి బాటలో నడుస్తుందని వారు తెలిపారు. పార్నపల్లి నుండి నీటిని తేవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి అనన్యనీయమని వారు తెలిపారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన కట్టాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎండాకాలం నడుస్తున్నందున నీటి కొరత లేకుండా చూస్తున్నామని. అన్ని వార్డుల్లో కూడా నీటిని వృధా చేయడం, కాలువలోకి వదలడం లాంటివి చేయరాదని వారు తెలిపారు. ఇలా చేయడం వలన చివరి వార్డుల వారికి నీరు వచ్చే అవకాశం ఉండదని వారు తెలిపారు. అదేవిధంగా 2023-24 సంవత్సరపు అడ్వాన్స్ టాక్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తుందని వారు తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ లో ఒక కోటి రూపాయలు వసూలు చేయడం జరిగిందని, 18/4/2023 వ తేదీ వరకు 60 లక్షలు వసూలు కావడం జరిగిందన్నారు. కావున పట్టణ ప్రజలు ప్రభుత్వము ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img