విశాలాంధ్ర -పెనుకొండ : ప్రభుత్వ హాస్పిటల్ కు వివిధ గ్రామాల నుండి వైద్య పరీక్షల కొరకు వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు, వారి సహాయకులకు, అనారోగ్యముతో హాస్పిటల్ కి వచ్చినటువంటి వారికి, ఆరోగ్య కార్యకర్తలకు నారాయణ సేవలో భాగంగా 100 మందికి అన్నదానం వాటర్ పాకెట్లను అందజేసారు. ఈ కార్యక్రమమునకు జింక భవాని, భర్త కురాకుల రాజారాం , కీర్తిశేషులు అయిన శివయ్య, జింక పద్మావతమ్మ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమానికి సహకరించారు: వీరికి వీరి కుటుంబ సభ్యులకు సేవలో పాల్గొన్న వారందరికీ సత్య సాయి బాబా ఆశీస్సులు ఉండాలని తాలూకా సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు శంకర్ తెలిపారు.