Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ఎస్ఆర్ఐటి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..

తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండలంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఎగ్ రైస్, కర్డ్ రైస్ తిన్న అనంతరం కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురి అయినట్లు విద్యార్థులు తెలిపారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆందోళన చెందిన హాస్టల్ నిర్వాహాకులు 30మంది విద్యార్థులను అనంతపురం పట్టణంలోని అమరావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగాని ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img