5.2 కిలోల బరువున్న శిశువు జననం
కడుపు భారీగా ఉన్న మహిళకు కిమ్స్ సవీరాలో శస్త్రచికిత విశాలాంధ్ర అనంతపురం వైద్యం సాధారణంగా పుట్టిన వెంటనే మన దేశంలో పిల్లలు 2.5 నుంచి 4 కిలోల వరకు బరువు ఉంటారు. 3-3.5 కిలోలను సగటు బరువుగా చెబుతుంటారు. కానీ అనంతపురం జిల్లాలో తొలిసారిగా 5.2 కిలోల బరువున్న శిశువు జన్మించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ శిల్పా చౌదరి తెలిపారు.