ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి.
విశాలాంధ్ర – ధర్మవరం:: రక్తం అవసరం ఉన్నవారికి రక్త నిధి ద్వారా తగినంత రక్తమును అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్. డాక్టర్. నజీర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పెథాలజిస్ట్ డాక్టర్. వైష్ణవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణము గ్రామీణ ప్రజలకు అత్యవసరమైన సమయాలలో రక్తము కొరకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి యందు రక్త నిధి కేంద్రము ఉన్నదని (బ్లడ్ స్టోరేజ్ సెంటర్), దీనిద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ, రక్తము అవసరమున్నవారికి ఏ గ్రూపులో అయినా ఉచితంగా అందించి, వైద్య చికిత్సలను అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల ద్వారా అవసరమైన పేషెంట్లకు బ్యాంక్ అకౌంట్ బార్కోడ్ ద్వారా 800 రూపాయలు చెల్లించితే రక్తమును పొందే అవకాశం ఉందని తెలిపారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు సురక్షితమైన రక్తమును పొంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనవచ్చునని తెలిపారు. రక్తదానం చేసేవారు(దాదాపు 30 మంది) కూడా బ్లడ్ స్టోరేజ్ నిర్వాహకుడు హరిప్రసాద్ సెల్ నెంబర్.. 94 92 600 559 కు ఫోన్ చేస్తే స్వీకరించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు రక్తం అవసరం ఉన్నవారు, తప్పక ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను పొందవచ్చునని తెలిపారు.