London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

15 మంది చిన్నారులకు ఉచిత కంటి పరీక్ష

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి త్వరిత చికిత్స కేంద్రము నందు రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో 15 మంది చిన్నారులకు ఉచిత కంటి పరీక్ష నిర్వహిస్తున్న వారు పేర్కొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… పుష్పగిరి కంటి ఆసుత్రి కడప వారి సహకారంతో బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక పుట్టిన పిల్లలు, మరియు గుండె లోపం, రక్తహీనత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను సమీకరించడం జరిగిందన్నారు. వారికి కంటి రెటీనా పరీక్షలను ‘రెడ్ కామ్’ అనే పరికరంతో స్క్రీన్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో 20 మంది పిల్లలను పరీక్షించగా ,అందులో 15 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని మరల రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే వీరికి ఉచితంగా చికిత్స చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్య నిపణురాలు డా. శ్రీవిద్య, కంటి పరీక్షా నిపుణురాలు జ్ఞాన ప్రసన్న, మేనేజర్ రజిత, స్టాఫ్ నర్స్ దివ్య,మౌనిక పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img