Monday, June 5, 2023
Monday, June 5, 2023

పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని రోజా మస్జిద్ ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద ఆదివారము సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఖాత్న (వడగులు) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు, ఫయాజ్ బాషా ట్రస్ట్ చైర్మన్ హీరాపురం ఫయాజ్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 31 సంవత్సరాల నుండి పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖాత్నా చేస్తున్నారు. ఎంతోమంది పేదవారు ఖాత్నా చేయించుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందు లు పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఉచిత ఖాత్నా చేయడం ఎంతో మేలు చేసిన వారు అవుతారన్నారు. అనంతరం ఖాత్నా చేయించుకున్న వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ షాషావలి వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ భాష, జాకీర్, ఎస్.మొహమ్మద్ రఫీ ప్రభుత్వ సర్కాజి సయ్యద్ ఖాద్రి ఇక్బాల్ ఖాద్రి అహ్మద్, రజాసాహెబ్, అహ్మద్ రజా ఖాద్రీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img