విశాలాంధ్ర – కర్నూల్ సిటీ: తెలుగు డిటిపి, టైలరింగ్ లో 18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీల సంయుక్త ఆధ్వర్యంలో లయన్స్ స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ లోపు ఆసక్తి గలవారు తమ పేర్లను వెంకటరమణ కాలనీ నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9396861308కు సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్ సభ్యులు లయన్ గోవర్ధనగిరి, లయన్ చిన్నస్వామి ,లయన్ రాయపాటి నాగలక్ష్మి పాల్గొన్నారు.