Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చెయ్యాలి : సీఐటియు

విశాలాంధ్ర-గుంతకల్లు : మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు విధించిన ఫేస్ రిజిస్టర్ మస్టల్ ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని గురువారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం సీఐటియు నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా జిల్లా ఉపాద్యాక్షులు కసాపురం రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగుల తో పాటు ఒప్పంద కార్మికులకు కూడా నూతన హాజరు విధానాన్ని అమలు చేసేందుకు పూలుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద కార్మికుల్లో మరియు మునిసిపల్ పర్మినెంట్ కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మున్సిపల్ సిబ్బందిలో అత్యధికమైనది స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి నైపుణ్యం లేని కార్మికులు. అత్యధిక మందికి స్మార్ట్ ఫోన్లు లేవు చదువు కూడా అంతంత మాత్రమే అటువంటి వారిని స్వయంగా మీరే ఎఫ్ఆర్ఎస్ తీసి పంపిస్తే హాజరు పడుతుంది హాజరు పడితేనే జీతాలు వస్తాయి ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్న తరుణంలో మునిసిపల్ పర్మినెంట్ సిబ్బంది ఒప్పంద కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని నిలుపుదల చేసి మున్సిపల్ రంగంలోని కార్మిక సంఘాలతో జాయింట్ సమావేశం జరపాలని కోరారు.అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పట్టణ విస్తరణ మేరకు అదనపు కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు కె.నరసయ్య,తిమ్మప్ప, మల్లి, రంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img