విశాలాంధ్ర – తాడిపత్రి : బిసి కుల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు వై.రామాంజ నేయులు శనివారము ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 139 బిసి కులాలకు కంటితుడుపు చర్యగా 56 బిసి కుల కొర్పొరేషన్లను ఏర్పాటు చేసి, బిసి కులాలకు వెన్నెముకగా ఉంటామని వైసిపి ప్రభుత్వం ప్రకటించుకుంది. బిసి ల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులివ్వ కుండా జగన్ రెడ్డి ప్రభుత్వం బిసి సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి బిసి సమాజం వెన్ను విరిచిందన్నారు. బటన్లు నొక్కు తున్న ముఖ్యమంత్రి బిసి సమాజం, సంక్షేమం కోసం బిసి కార్పొరేషన్ ల నిధుల కోసం ఏ బటన్ నొక్కాడో చెప్పాలని విమర్శించారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం కలెక్టరేట్ల వద్ద అర్ధనగ్న నిరసనకు ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాయలసీమ జోనల్ తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించే ఈ అర్ధనగ్న నిరసన కార్యక్రమాలలో భారతీయ జనతాపార్టీ ఒబిసి మోర్చా మండల స్థాయి కార్య కర్తలు, బిజెపి కుటుంబ సభ్యులు, బిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.