విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో శుక్రవారం గంబు షియా చేపలను వదిలారు. గ్రామ సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అమృతరాజు, ఉరవకొండ సీఐ హరినాథ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నచోట దోమలు గుడ్లు లార్వాలు వృద్ధి చెందకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికై అనంతపురం నుంచి ఫిష్ డిపార్ట్మెంట్ ద్వారా పదివేల గమ్ముషియా చేపలను ఉరవకొండ పట్టణానికి తీసుకొచ్చి వివిధ వార్డులలోని మురికి కాలువలలో వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వన్నప్ప, వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున, వైసిపి నాయకులు బసవరాజు, పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్, పంచాయతీ, ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు