విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల నియోజకవర్గంలోని తాడిమర్రిలో రహదారి విస్తరణ పనులు లో భాగంగా తాడిమర్రి ప్రజలు ఎంతో నష్టపోయారని వారిని ఆదుకోవాలని కోరుతూ బుధవారం ఆర్డిఓ తిప్పే నాయక్ కు బిజెపి మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు జింక చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ గంగులకుంట గోపాల్ రెడ్డి, రాష్ట్ర చేనేత సెల్ కార్యవర్గ సభ్యులు గుండా పుల్లయ్య, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ సోముల ప్రకాష్ నాయుడు తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐదు రోజులుగా తాడిమర్రి ప్రధాన రహదారి విస్తరణ పనులు అధికారులు చేపడుతున్నారనీ,,దారికి ఇరువైపులా ఉన్న ఇల్లు దుకాణాలు భవనాలు కూల్చివేశారనీ, విస్తరణ పేరుతో అధికారులు చేసిన పనులకు పలు కుటుంబాలు వీధిన పడ్డాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.గత నెల రెవెన్యూ అధికారులు రహదారికి ఇరువైపులా ఉన్న 83 మందికి నోటీసులు జారీ చేశారనీ ,వీరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ముందస్తు హెచ్చరికలు చేయకుండానే, కూల్చివేత పనులు ప్రారంభించ డం ఎందు ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.80 ఏళ్లుగా నివాసమున్న భవనాలకు అధికారులు ఇంటి గుత్తలు, కరెంటు బిల్లులు, నీటి పన్నులు, వసూలు చేశారనీ,కానీ దారికి ఇరువైపులా స్థలం గ్రామ కంఠంలోనిదిగా ఉందని వీటిలో నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు తెలపడం జరిగిందన్నారు.
ప్రభుత్వం అన్ని పన్నులను కట్టించుకుని, తర్వాత కూడా ఇలా ఆక్రమించుకున్నారని అధికారులు తెలపడం ఎంతవరకు సమంజసం? అని తెలిపారు.నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. అయినా అభివృద్ధికి వారు ఎటువంటి ఇబ్బందులు సృష్టించలేదు అని తెలిపారు. కూల్చివేతతో రోడ్డున పడ్డ కుటుంబాలకు ఇంటి స్థలం పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తూర్పు చెరువు కట్ట సమీపంలో ప్రభుత్వ భూమి 494 సర్వే 25 ఎకరాల 07 సెంటు భూమి ఉంది అని, వెలుగులో కి తేవడం జరిగిందన్నారు. ఆర్.టి.ఐ చట్టం ద్వారా
కూల్చివేతతో నష్టపోయిన కుటుంబాలకు మూడు సెంట్లు చొప్పున అందులో ప్రభుత్వ స్థలం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కో కన్వీనర్ చట్టా నారాయణ స్వామి, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ జల్లా కార్తీక్, భక్తవత్సలం నాయుడు,సాకే. చంద్ర మహేష్,పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.