Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వండి

కెనరా బ్యాంక్ ఎల్డీఎం – రమణ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలను ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని కెనరా బ్యాంక్ ఎల్డీఎం- రమణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వస్తున్న జగనన్న తోడు, సబ్సిడీ రుణాలు మహిళలకు ఎంతగానో ఎదుగుదల కోసం ఉపయోగపడతాయని, చిరు వ్యాపారాల నిమిత్తం రుణాల పంపిణీ, బ్యాంకర్ల ద్వారా మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు బ్యాంకర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఓ- రామేశ్వర్ రెడ్డి, ఏపీఎం- రఘునాథరెడ్డి, కనగానపల్లి, రామగిరి,సికె పల్లి మండలాలకు చెందిన ఏపీ ఎం లు, సీసీలు తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img