Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

వృద్ధులకు అన్నదానం చేయుట దైవ సేవతో సమానం

ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర
విశాలాంధ్ర – ధర్మవరం : వృద్ధులకు అన్నదానం చేయుట దైవ సేవతో సమానమని ఆశ్రమ నిర్వాహకులు తరఫున చంద్ర పేర్కొన్నారు.. ఈ సందర్భంగా శుక్రవారం ధర్మవరం ఎన్ఎస్యుఐ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి భార్య బృందావన దంపతులు తమ కుమార్తె బావికా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఆశ్రమంలోనే కేకు కట్ చేసి వృద్ధుల యొక్క ఆశీస్సులను భావిక పొందారు. అనాధాశ్రమంలోని వృద్ధులు భావిక కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ వృద్ధులకు వస్త్ర దానం, అన్నదానం చేయడం మాకెంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకున్న దానిలో అనాధాశ్రమములకు, పేద ప్రజలకు సహాయం చేయాలని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రభుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img