Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం

మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవం

డాక్టర్. సువర్ణ లక్ష్మి, కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్

అనంతపురం – విశాలాంధ్ర వైద్యం : మంచి నిద్ర అంటే మంచి ఆరోగ్యం. శారీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నవాళ్లు కూడా ఆహార, వ్యాయామాలకి ఇచ్చిన ప్రాధాన్యత నిద్రకు ఇవ్వడం లేదు. అందుకు నిద్రకు సంబంధించిన జబ్బులు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 3వ శుక్రవారం నాడు నిర్వహిస్తారు. వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ ఆధ్వర్యంలో 2008 నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
సరైన నిద్రలేకపోవడం వల్ల హైబిపి, షుగర్, ఊబకాయం, పక్షవాతం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రకు సంబంధించిన జబ్బుల్లో ముఖ్యమైనది నిద్రలేమి.
నిద్రలేమికి ముఖ్య కారణాలు
పడుకొని లేవకపోవడం, మానసకి ఆందోళన, కాఫీలు, మద్యం ఎక్కువగా తీసుకోవడం, అలాగే డ్రగ్స్ కొన్ని రకాల మందులు తీసుకోవడం.
మన జనాభాలో 10 శాతం మందికి స్లీప్ ఆప్నియా ఉన్నట్లు అంచనా. గాలిమార్గాల్లో అడ్డుకుంలు ఏర్పడడం వల్ల శ్వాస ఆటంకం ఏర్పడడమే స్లీప్ ఆప్నియా. ఇది ఉన్నవారికి ప్రధానంగా గురుక రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఉదయంపూట తలనొప్పి, పగటి సమయంలో మగతగా, అలసటగా ఉండడం ఉంటుంది. స్లీప్ స్టడీస్ ద్వారా ఈ సమస్య గుర్తించవచ్చు. సీపీఏపీ థెరపి మాస్క్ లాగా ఉండే చిన్న పరికరం ఇది. దీని లోపలి నుంచి పాజిటివ్ ప్రెజర్ వచ్చి ముక్కులోపిలి గాలి మార్గాన్ని వెడల్పు చేస్తుంది. బురువు తగ్గడం, కొన్ని రకాల శస్త్రచికిత్సల ద్వారా ఈ బబ్బుకు చికిత్స చేయవచ్చు.
సుమారుగా 40 శాతం మంది ప్రపంచ జనాభాలో ఇలాంటి నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కానీ వీరిలో అవగాహన లోకపోవడం వల్ల మూడవ వంతు బాధితులు మాత్రామే వైద్యులను సంప్రదిస్తున్నారు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి

  • పెద్దగా గురకపెట్టడం, నిద్రలో ఎగ ఊపిరి, పోరబారడం
  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు మెలుకువగా ఉండడం కష్టంగా ఉన్నప్పుడు
  • పని లేదా ఇంటిపై శ్రద్ద చూపడం లేదా ఏకాగ్రతలో ఉండటం కష్టం
  • దాదాపు ప్రతిరోజు నిద్రపోవాలని మీకు అనిపిస్తుంది.
  • పగటి సమయంలో నీరసంగా, మగతగా ఉన్నప్పుడు.
    మీరు ఈ లక్షణాలు గమనిస్తే తప్పనిసరిగా దగ్గరలోని పల్మోనాలజిస్ట్ ని సంప్రదించాలి.
    హాయిగా నిద్ర పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
  • ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.
  • పగటిపూట నిద్రపోకుండా ప్రయత్నించాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర సమయం నాణ్యత పెరుగతాయి.
  • మద్యం, పోగత్రాగడం లాంటి అలవాట్లు మానుకోవాలి.
  • పడకగది వాతావరణం నిశబ్దంగా, ఎక్కువ కాంతి లేకుండా, సరైన ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి.
  • మంచాన్ని పడుకోవడనికి మాత్రమే ఉపయోగించాలి. మంచంలో కూర్చొని ల్యాప్ టాప్ లేదా ఫోన్ చూడడం, పుస్తకాలు చదవడం వంటివి చేయవద్దు.
  • నిద్రకు ఉపక్రమించే ముందే కనీసం 2 గంటల మందే భోజనం చేయాలి.
  • రాత్రి భోజనం చేసిన తరువాత టీ, కాఫీలు తాగకూడదు.
  • మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్లు కనీసం నిద్ర సమయానికి 2 గంటల ముందు నుండే దూరంగా ఉండాలి.
  • మానసిక ఆందోళన కలిగించే విషయాలు రాత్రిపూట, నిద్ర సమయంలో చర్చించవద్దు.


సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img