ముఖ్యఅతిథి బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే చదువుకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎల్పీ సర్కిల్లో గల శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. అనంతరం లక్ష్మీకాంతరెడ్డి తో పాటు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున మాట్లాడుతూ చదువుతోపాటు అన్ని రంగాలలో విద్యార్థులు పోటీ తత్వమును పెంచుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా, వారి కష్టానికి ఫలితంగా మీ ద్వారా మంచి చదువును ఇవ్వాలని తెలిపారు. చదువుకు పేదరికం ఎప్పుడూ అడ్డు కాదని, చదవాలన్న తలంపు పట్టుదల ఉన్నప్పుడు ఎంతవరకు నైనా చదువును కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థినీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జగదీష్, అధ్యాపకులు రమేష్, శ్రీరాములు, రామాంజనేయులు, శ్రీనివాసులు, వాణి, కావ్య శ్రీ, నవ్య శ్రీ, అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.