Friday, April 19, 2024
Friday, April 19, 2024

సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర చాలా ముఖ్యం

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత

విశాలాంధ్ర – ధర్మవరం : సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర చాలా ముఖ్యమని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రపంచాన్నిద్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవన శైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లతోపాటు నిద్ర గురించి మనలో నెలకొన్న అపూహలు, మనల్ని సుఖనిద్రకు దూరం చేస్తున్నాయని తెలిపారు. తద్వారా శారీరకంగా మానసికంగా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. మన జీవన శైలిలోని కొన్ని మార్పులు తెలిసో తెలియకో చేసిన పలు పొరపాట్ల కారణంగా నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుందని వారు తెలిపారు. వయస్సు ఏదైనా నిద్ర సమయాల్లో తేడా ఉండదని వారు తెలిపారు. ఏ వేల్లోనైనా సరే.. ఎనిమిది గంటల నిద్రకు సమయం కేటాయించాలని తెలిపారు. ఇలాంటి నిద్రలు కాకుండా దీర్ఘకాలం పాటు ఇదే రొటీన్ ను కొనసాగిస్తే మాత్రం డిప్రెషన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని వారు తెలిపారు. మానవ శరీరానికి నిద్ర అనేది ఆరోగ్యదాయకమని వారు తెలిపారు. మన శరీరానికి మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వడమే అనేది నిద్రపోవడమే అని తెలిపారు. తద్వారా శరీర అవయాలు మరింత చురుగ్గా పనిచేస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img