విశాలాంధ్ర – తనకల్లు : మండల పరిధిలోని బొంతలపల్లి గ్రామ పరిధిలో 189 సర్వే నంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని 30 సెంట్లు ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తోపు పారేశు స్పందన కార్యక్రమంలో తాసిల్దార్ శోభా సువర్ణమ్మకు వినతిపత్రం అందజేశారు పేదలకు పట్టాలివ్వాలంటే నెలల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి ఉంటుందని విలువైన ప్రభుత్వ భూములనుఅమ్ముకుంటున్న రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదని ఈ విషయంపై చర్యలు చేపట్టకపోతే తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రమణప్ప నరసింహులు తదితరులు పాల్గొన్నారు.