విశాలాంధ్ర- పెనుకొండ : నగర పంచాయతీ నందు కొంతమంది ప్రభుత్వ స్థలాన్ని మాకు పట్టాలు ఇచ్చారని నమ్మ పలుకుతూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయుటకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమై సోమవారం రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి సబ్ కలెక్టర్ కార్తీక్ విషయము తెలుపగా మంగళవారం రోజున కబ్జా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కార్తీక్ సర్వే నంబర్ 668 కబ్జాఅయిన స్థలాన్ని సబ్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. ఎవరైనా అక్కడికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు చేసి అక్కడికి వెళ్లే వారిపై కేసుల నమోదు చేయాలని తాసిల్దార్ స్వర్ణలతకు తెలియజేశారు. ఆ ప్రాంతంలో నిషేధిత బోర్డు ఏర్పాటు చేయాలని తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కోదండపాణి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు