Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

రైతుల సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలి

ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జే. వి. రమణ
విశాలాంధ్ర – ధర్మవరం : రైతు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చర్యలు గైకొనాలని ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జే. వి.రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు మహదేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో వారు పాల్గొని నినాదాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు.. ఏఐకేఎస్.. రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, ముఖ్యంగా పండిన పంటకు గిట్టుబాటు ధరలను నిర్ణయించి చట్టపరమైన హక్కులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంను ప్రభుత్వం వెంటనే పూర్తిగా ఉపసంహరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మరింత ఆందోళన కార్యక్రమాలు చేయడానికి దేశవ్యాప్తంగా రైతులు సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img