Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంక భూపాలపురం నందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ కె. మలీన్బీ అధ్యక్షత వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు త్యాగాలు మనందరికీ ఆదర్శనీయమని తెలియజేసినారు. అనంతరం కె వి ప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించిన పోరాట వీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని గిరిజనుల హక్కుల కోసం వీర మరణం చెందిన మహావీరుడు అటువంటి మహానీయులు త్యాగాలు గుర్తు చేసుకుని మంచి భావిభారత పౌరులుగా ఎదగాలని సూచించినారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి. ఆదినారాయణ,ఏ. రమేష్, వి. శారద దేవి, జి. మాలకొండయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img