Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం నందు గురువారము ఐదో వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆదిశేషయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జేసీ అభిమానులతో కలిసి ఆనందం పాలుపంచుకుంటూ మిఠాయిలు పంచి కొడుకు ఘనంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదటగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలోనే మున్సిపాలిటీ కి ఆస్తులు, డబ్బులు ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపాలిటీకి ఆదాయ వనరులు సమకూర్చి తాడిపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. అలాంటి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు మంచి సేవ అందించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో తెలుగుదేశం నాయకులు జేసీ అభిమానులు రజక సేవా సంఘం నాయకులు రజక కులస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img