Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఘనంగా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర. నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని శ్లోక స్కూల్ నందు ధ్యాన్ చందు జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవంను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధ్యాన్ చందు చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడల వల్ల కలిగే లాభాలను, క్రీడాలలోని మెలకువలను విద్యార్థులకు వివరించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్లోకా పాఠశాల చైర్మన్ శ్రీధర్ రెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, బసిరెడ్డి డిగ్రీ కళాశాల డైరెక్టర్ రమేష్ రెడ్డి, శ్రీ నంది జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, శ్లోక పాఠశాల డైరెక్టర్స్ కవిత, శ్రీదేవి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img