జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం రేంజ్ డి.ఐ.జి
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం రేంజ్ కార్యాలయంలో డి.ఐ.జి శ్రీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రేంజ్ పరిధిలోని ప్రజలకు, పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 77 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని అనంతపురం రేంజ్ కార్యాలయంలో మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశ స్వాతంత్ర్య సముపార్జనలో త్యాగం చేసిన అమరులను ఈసందర్భంగా డి.ఐ.జి గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితమే నేటి మన స్వాతంత్ర్య సంబరమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మరియు శ్రమించిన మహాత్ములందరినీ స్మరించుకుంటూ త్యాగధనుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.