జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అదనపు ఎస్పీ
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన మరియు పోరాడిన త్యాగధనులను అదనపు ఎస్పీ ఈసందర్భంగా గుర్తు చేశారు. నివాళులు అర్పించి వారి త్యాగాలను వివరించారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, నాగభూషణరావు, హనుమంతు, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్, డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథ చౌదరి, సెబ్ సి.ఐ నరసానాయుడు, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.