విశాలాంధ్ర -శెట్టూరు : మండల కేంద్రంలో తాసిల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , పోలీస్ స్టేషన్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తాహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఈశ్వరయ్య శెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన అసువులు బాసిన వీరులు గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాము. మన దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది తమ జీవితాలను అంకితం చేశారు. వారి ఆశయాలు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వాన స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన తెలియజేశారు
అనంతరం వివిధ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీమతిఎంపీపీ లక్ష్మీదేవి, ఎస్సై రాంభూపాల్,ఇంచార్జ్ ఎంపీడీవో రఘురామారావు, డాక్టర్ తరుణ్ సాయి డిప్యూటీ తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి,
ఎంఈఓ శ్రీధర్ , జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిరోజ్ ఖాన్, కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ లలితమ్మ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గాయత్రి గ్రామ సర్పంచ్ కుమార్, మాజీ జెడ్పిటిసి గురు స్కూల్ కమిటీ చైర్మన్ తిప్పేస్వామి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీ నాయకులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు