విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యం అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసేపు, మల్లికార్జున, ఆంజనేయ, దశరథరాముడు, వీరేష్ గౌడ్, అంజి, నరసన్న, నాగప్ప, సత్యగౌడ్, మునెప్ప, బద్రి, రంగన్న, యంకప్ప, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు,