Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

శ్రీ వాణి డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా వినాయక ఉత్సవాలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : శ్రీవాణి పీజీ డిగ్రీ కళాశాలలో కళాశాల సీఈవో సుధాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే.వనజ అనుమతితో వినాయక చవితి సందర్భంగా విశేష పూజలు చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వార్డెన్ పిట్ల నందకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ… కళాశాల వార్డెన్ అయినటువంటి పి ట్లా నందకుమార్ రెడ్డి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు తను నేర్చుకున్నటువంటి గ్రామీణ స్థాయి కళా సంప్రదాయాన్ని అయినటువంటి చెక్కభజన తమకు నేర్పించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా ఆయన తల్లి తండ్రి లేనటువంటి పేద విద్యార్థులకు తనువంతుగా ఇప్పటివరకు 49 మంది విద్యార్థిని, విద్యార్థులకు వారి చదువులకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు . వార్డెన్ అనే హోదాను పక్కనపెట్టి తమలో ఒక వ్యక్తిగా కలిసిపోతూ తన ఆలోచనలను మాతో పంచుకోవడం ఆయనలో ఉన్న గొప్పతనం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు హర్షవర్ధన్, శ్రావణ్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img