Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయండి

అక్రమంగా భూమి కొనుగోలు దారుల వన్ బి తొలగించండి
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన. లేపాక్షి సిపిఐ నాయకులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం లేపాక్షి సిపిఐ నాయకులు మరియు సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్తీక్ అందజేశారు వారు 2013 నుండి ప్రభుత్వ భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరు పేదలు గుడిసెలు వేసుకుని జీవనాధారం చేసుకుంటున్నారని వెంటనే వారికి ఆ స్థలంలో ఇంటి పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని సిపిఐ పెనుకొండ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు లేపాక్షి మండల కార్యదర్శి శివప్ప డిమాండ్ చేశారు. . ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ తో సిపిఐ నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన డి పట్టాన్ని కొంతమంది అక్రమ కొనుగోలుదారులు క్రయవిక్రయాల జరిపారని ప్రభుత్వ భూమి అన్యాయకంతం కావడంతో ఆ బంజర భూమిలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని క్రమక్రమంగా ఇప్పటికే 14 గృహాలు పూర్తిగా 15 మంది పునాదులు వేసుకున్నారని. మిగిలిన 8 మంది గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. అయితే కొంతకాలం క్రితం అక్రమ కొనుగోలుదారులకు సర్వే నెంబర్ 455-2 లెటర్ లో 1.15 సెంట్ల కు తాసిల్దార్ వన్ బి పాసుబుక్కులు మంజూరు చేశారని. వెంటనే వాటిని తొలగించి. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలన్నారు. 2018 నుండి ఈ భూమి కోర్టులో వజ్యం జరుగుతున్నప్పటికీ ఇప్పటి తాసిల్దార్ పాసు పుస్తకాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం తెలిపారు వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ లేపాక్షి సహాయ కార్యదర్శి గౌతమ్ కుమార్ సీనియర్ నాయకుడు నారాయణరెడ్డి బాలు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img