Monday, September 25, 2023
Monday, September 25, 2023

స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు మంజూరు చేయండి

రెండవ రోజు కార్యాలయం ఎదుట కొనసాగిన సమ్మె
విశాలాంధ్ర – తనకల్లు : ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు స్వచ్ఛభారత్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా సెక్రెటరీ రమేష్ హాజరై మాట్లాడుతూ దాదాపు పది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే జీతాలు మంజూరు చేయాలన్నారు హైకోర్టు తీర్పును జిల్లాల అమలు చేయాలని టెండర్ తో సంబంధం లేకుండా కార్మికులను కొనసాగించాలని, కనీస వేతనం 21000 ఇవ్వాలని రాజకీయ వేధింపులు ఆపాలని కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఒంటెద్దు ఏమన్నా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివన్న రైతు సంఘం జిల్లా సభ్యులు వివి రమణ పంచాయతీ కార్మికులు రమణ గంగాధర శ్రీనివాసులు ఆంజనేయులు అంజి శివన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img