Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు


విశాలాంధ్ర – పెద్దకడబూరు : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొడ్డి మేకల, హెచ్ మురవణి, కంబదహాల్ గ్రామాల్లో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్పంచులు చంద్రశేఖర్, జానకమ్మ, దస్తగిరి అధ్యక్షతన నా మట్టి – నా దేశం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని, దేశ సమగ్రతను కాపాడుతామని, దేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల వలె ఐక్యమత్యంతో జీవించాలని పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. చెట్లు మానవాళికి జీవనాధారమని గుర్తు చేశారు. చెట్లు పెంపకం వలన సకాలంలో వర్షాలు కురవడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పంచాయతీ ప్రభుత్వ భవనాల వద్ద 75 మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం హెచ్ మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటిని పరిశీలించారు. అలాగే మద్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేష్, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, గజేంద్ర రెడ్డి, పూజారి ఈరన్న దేవదానం, బాస్కర్ ఉరుకుందప్ప, ఏపీవో రామన్న, పంచాయతీ కార్యదర్శి అయ్యపురెడ్డి, శ్రీనివాసులు, రఫిక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img