Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గ్రీవెన్స్ 100 శాతం పరిష్కరించాలి

జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ఎలాంటి పెండింగ్ ఉంచరాదు : జిల్లా కలెక్టర్ యం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ను పూర్తిగా 100 శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పరిషత్ సీఈవో కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, నీలమయ్య, ఆర్డీఓ మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 418 అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఓ ప్రశాంత్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img