Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

గుంతకల్లు కేజీబీవీ ఎస్ ఓ పై చర్యలు తీసుకోవాలి

  • ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని దోనముక్కల రోడ్ లో ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ హాస్టల్ ముందు సుమారు గంటసేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్, పట్టణ కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ… జిల్లాలో అనేకసార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన కదలని అధికార యంత్రాంగంఅని,ప్రభుత్వం నుండి వచ్చే మెనూ కాకుండా సొంతమే నువ్వు తో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ ఓ లు. విద్యార్థులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజనం రాత్రికి రాత్రి భోజనం ఉదయం కు విద్యార్థులకు పెడుతున్నారన్నారు. స్థానికంగా ఉండకుండా ఈ కేజీబీవీలో ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని స్థానిక సమస్యలు ఉంటే, మరికొన్ని ప్రభుత్వం నుండి చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఏఐఎస్ఎఫ్ గా అందరం చేస్తే గత కొన్ని రోజుల క్రితం కాంపౌండ్ వాల్ కు నిధులు విడుదల చేశారని తెలిపారు.ఆ విధంగా ప్రభుత్వం కేజీబీవీ హాస్టల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందజేయాలని లేని పక్షంలో అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా అధికారులను కోరారు. విద్యార్థులను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధ్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు రాము, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img