హ్యాండ్లూమ్స్ ఏడి రమేష్
విశాలాంధ్ర, ధర్మవరం : చేనేత, సిల్క్ ఉత్పత్తులను, అమ్మకాలను ప్రోత్సహించడానికి చేనేత జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 13వ 14వ తేదీలలో విజయవాడలోని ఎంజీ రోడ్డు లోని శ్రీ శేష సాయి కళ్యాణ వేదిక యందు, బయ్యర్ షెల్టర్ మీట్ నిర్వహిస్తున్నారని హ్యాండ్లూమ్స్ ఏడి రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి చేనేత, సిల్క్ సహకార సంఘములు, మాస్టర్ వీవర్లు, చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. కావున వస్త్ర వ్యాపారులు, మాల్స్ షోరూమ్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బయ్యర్ షెల్టర్ను సందర్శించి, ధర్మవరం పట్టుచీరలతో పాటు ఇతర చేనేత సిల్క్ ఉత్పత్తులను కొనుగోలు చేసి, చేనేత పరిశ్రమను ప్రోత్సహించాల్సిందిగా వారు కోరారు.