విశాలాంధ్ర- రోద్దం మండల పరిధిలోని కోగిర జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో శుక్రవారం హిందీ ఉపాధ్యాయుడు.జాబిలి చాంద్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం జరిగింది.విధ్యార్థులే హిందీలో వ్యాఖ్యానం చేస్తూ ఒక ఉత్సవంలా హిందీ దివస్ ను జరిపారు.హిందీ లో ఉపన్యాసాలు,కథలు చెబుతూ,బాలగేయాలు,పాటలు పాడుతూ ఉల్లాసంగా.ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 14ను హిందీ దివస్(హిందీ భాషా దినోత్సవం)గా దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. భాష ఏదైనా అందరికీ అర్థమయ్యేది హిందీ.. ఇది కేవలం భాష కాదు. కోట్లాది భారతీయుల హృదయ స్పందన. మన ఆత్మగౌరవం. మన సనాతన సంస్కార సాఫల్యాలకు ప్రతిబింబం అని జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య ఇంగ్లిష్, చైనీస్ తర్వాత మూడోస్థానంలో ఉంది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీ తన సుస్థిరమైన స్థానాన్ని సాధించింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశలు,పోతులయ్య,హసీనా,బాను,శివయ్య,రమేష్,రామంజి,ఆదినారాయణ,శ్రీదేవి,విద్యార్థి,విధ్యార్థినిలు,తదితరులు పాల్గొన్నారు.