విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం అని మెడికల్ ఆఫీసర్ పుష్పలత తో పాటు వివిధ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని కునుతురు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరము నందు 252 మందికి ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను కూడా సరఫరా చేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా 65 మందికి కంటి పరీక్షలు 57 మందికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి ఐసిడిఎస్ వారిచే పోషక ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.. మొత్తం మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శనమల డాక్టర్ దిలీప్ కుమార్, స్పెషలిస్ట్ డాక్టర్లు వినోద్ కుమార్, మనోరంజన్, జిల్లా శ్రేయ నివారణ అధికారి తిప్పయ్య డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ అండ్ డి ఎల్ డి వో శివారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ చాంద్ బాషా, సిహెచ్ఓ కళావతి, ఆప్తాలిక ఆఫీసర్ ఉరుకుందప్ప, స్థానిక ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచు సత్యమయ్య, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.