Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదు

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : ఆరోగ్య పరిరక్షణలో ఎవరు నిర్లక్ష్యం చేయరాదని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్కేయూ ఔషధ కళాశాల ఆధ్వర్యంలో సవేరా హాస్పిటల్ సహకారంతో ఆకుతోటి పల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటుచేసి వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. మానవుని దేహంలో గుండె పాత్ర అత్యంత కీలకమైనదని రక్త ప్రసరణను చేస్తూ ఆరోగ్య సంరక్షణను చేపడుతూ ఉందన్నారు. గుండెపోటుతో ఇటీవల ఎంతోమంది యువత కూడా మరణిస్తూ ఉండటం బాధాకరంగా ఉందన్నారు. మానసిక ఒత్తిడి నివారణకు వ్యాయామం, యోగను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ మల్లికార్జున్రెడ్డి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ మురళీధర్ రావు, పరీక్షలు విభాగం డైరెక్టర్ జివి రమణ, ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ చిత్ర గురుప్రసాద్, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img