Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

హెన్రీ డ్యూ నాంట్ సేవలు చిరస్మరణీయం.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు

విశాలాంధ్ర -ధర్మవరం : హెన్రీ డ్యూ నంట్ సేవలు చిరస్మరణీయమని ఇండియన్ రెడ్ క్రాస్ ధర్మవరం శాఖ చైర్మన్ డాక్టర్ నరసింహులు, శ్రీ సత్య సాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్, కార్యదర్శి శివయ్య, కోశాధికారి డాక్టర్ సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ప్రపంచ రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూ నాంట్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించే ప్రతి ఒక్కరిని మనం మరువరాదని, వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. హేన్డ్రి డ్యూనాంట్ మానవతావాది, సామాజికవేత్త, రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక విపత్తుల ద్వారా బాధపడుతున్న పేద ప్రజలకు రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యులుగా చేరి, మరిన్ని సేవలను అందించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థగా ఖ్యాతి గరించిందని వారు తెలిపారు. ప్రస్తుతం ధర్మవరంలో రెడ్ క్రాస్ సంస్థ వివిధ రకాల లో సేవలు అందించడం జరుగుతుందని, వ్యవస్థాపకులు యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని తెలిపారు. ఇటీవలే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అది విజయవంతం కావడం అందరి కృషి న ని వారు తెలిపారు. తల సేమియా వ్యాధిగ్రస్తులకు, రక్తం అవసరమైన వారికి కూడా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందిస్తామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img