Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

గ్యాస్ అధిక ధరలు తగ్గించాలి

సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలు ప్రజలకు పెనుబారంగా మారిందని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్వతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాముల కూడలి వద్ద పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం వలన సామాన్య ప్రజల బ్రతుకు భారమైపోయిందని కనుక వెంటనే గ్యాస్ ధరలు అదేవిధంగా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజవర్గం మహిళ కార్యదర్శి రామాంజినమ్మ, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య ,ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్, ప్రజానాట్యమండలి పట్టణ కార్యదర్శి పుల్లయ్య, సిపిఐ నాయకులు మురళి, మల్లయ్య ,ఆటో శివ ,ఏఐవైఎఫ్ నాయకులు నందు, వంశీ ,ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు అఖిల్ ,శాంతరాజు, షేక్షావలి, రాజేష్, శివమణి ,పాత గుంతకల్లు హమాలి మరియు ట్రాన్స్పోర్ట్ హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img