Friday, April 19, 2024
Friday, April 19, 2024

వేలంపాటలో మున్సిపాలిటీకి అధిక ఆదాయం

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ సర్కిల్ వద్ద నిర్మించదలచిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ కి గుడ్ విల్ ప్రాతిపతకన సోమవారం నాడు బహిరంగ వేళమును సోమవారం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి పెనుజురి నాగరాజు ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 15 గదులకు వేలంపాట నిర్వహించడం జరిగిందని, సర్కారు పాటగా రూ.10,02,115 పాడగా, అధికంగా వేలంపాటలో పాడిన వారికి ఆ గదులను నిర్ణయించడం జరిగిందని వారు తెలిపారు. ఇందులో కేటగిరి వారిగా వేలంపాట పాడడం జరిగిందన్నారు. హెచ్చు పాట పాడిన వారిలో ఎం. నాగభూషణ, బి. విజయభాస్కర్, సి. శ్రీనివాసరెడ్డి ,ఆర్. అశోక్ కుమార్, వై. విజయలక్ష్మి, పి. నాగరాజు, సి. భాస్కర్ రెడ్డి, ఎం. రామాంజనేయులు, వై. రాజు, జి. కృష్ణ భార్గవ్, వై. కేశవరెడ్డి.. రెండు గదులు, బి. మల్లికార్జున కె.బాల్ రెడ్డి లు కలరనీ తెలిపారు. 15వ నెంబర్ గది ఎస్టీ కేటగిరికి కేటాయించామని అందులో ఒకరు మాత్రమే వేలంపాటకు హాజరు కావడంతో, పాతదారులు లేనందున వాయిదా వేయడం జరిగిందన్నారు. మొత్తం 14 గదులకు గుడ్ విల్ గా 1 కోటి 49 లక్షల 59 వేల 917 రూపాయలు రావడం జరిగిందని, హెచ్చు పాట వేలంపాట ద్వారా 3 కోట్ల 51 లక్షల 85000 రాగా, మొత్తం మీద మున్సిపాలిటీ అనుకున్న గుడ్ విల్ కన్నా అదనంగా రెండు కోట్ల రెండు లక్షల 25 వేల 083 రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ లతోపాటు కమిషనర్ మల్లికార్జున మేనేజర్ ఆనంద్, ఆర్ఐలు.. షా వాలి, అన్వర్ భాష, కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, 57 మంది పాటదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img