విశాలాంధ్ర -ధర్మవరం: దేశ ప్రజల హృదయ భాష హిందీ అని హిందీ మాస్టర్ శర్మాస్ వలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం జాతీయ హిందీ భాష దినోత్సవం సందర్భంగా శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సభకు వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శర్మాస్ వలి మాట్లాడుతూ నేటి హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందని, హిందీ భాషను జాతీయ భాషగా 1949 సెప్టెంబర్ 14వ తేదీ గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి హిందీ నేర్చుకోవాలని, ఈ హిందీ భాష దేశంలో ఎక్కడైనా ఒక జీవిత గమ్యమును చేర్చుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ భాష కీలక పాత్ర పోషించిందని, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో, హిందీ భాష రెండవ స్థానంలో ఉందని వారు తెలిపారు. వాస్తవంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందీకి గౌరవప్రదమైన హోదా లభించిందని, మన అధికార భాష హిందీ వల్ల ప్రపంచ స్థాయిలో ప్రతి భారతీయుడికి గౌరవం లభించిందని, హిందీ ప్రపంచంలోని పురాతన, గొప్ప, సరళమైన భాషలలో ఒకటని తెలిపారు. నాటి నుండి నేటి వరకు హిందీ భాష అవసరం తీర్చుతున్నదని, స్వాతంత్రం కోసం ఉద్యమం ఊపొందుకున్నప్పుడల్లా హిందీ ప్రగతిరథం కూడా వేగంగా ముందుకు సాగిందని తెలిపారు. హిందీ జాతీయ చైతన్యానికి చిహ్నముగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెద్దిరెడ్డి తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.