Monday, September 25, 2023
Monday, September 25, 2023

సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించండి

వార్డు సభ్యుల విజ్ఞప్తి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిపై చర్చించడానికి తక్షణమే సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని పంచాయతీ వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్, మీనుగ రామాంజనేయులు, మీనుగా రవి, ముస్కిన్ సాహెబ్ సోమవారం గ్రామపంచాయతీ ఈవో గౌస్ సాబ్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ  జూన్ 23వ తేదీన సాధారణ సమావేశం నిర్వహించి  జగనన్న సురక్ష కార్యక్రమం ఉందని అర్ధాంతరంగా వాయిదా వేశారని. 60 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా  సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని వారు ప్రశ్నించారు. ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో  సీజనల్ వ్యాధులు, తాగునీటి సమస్య పారిశుద్ధ్యం, గృహ నిర్మాణ  అనుమతుల ఆమోదం, విద్యుత్ దీపాలు తదితర అనేక సమస్యలు నెలకొన్నాయని  సమావేశంలో చర్చించి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే సమావేశాన్ని నిర్వహించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిలాన్, రమేష్ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img