Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

నిన్న గృహనిర్బంధం – నేడు రహదారి దిగ్బంధం


అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన ర్యాలీ
ప్రధాన రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు


విశాలాంధ్ర, బెలగాం/ పార్వతీపురం: అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని మార్చి 20న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకొని, గృహనిర్బంధాలు చేసిన ప్రభుత్వ వైఖరికి సమాధానం చెబుతూ సోమవారం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర అంగన్వాడి సెంటర్లను మూసివేసి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన రహదారిపై బయటయించి రహదారిదిగ్బంధనం చేసి ప్రభుత్వం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు.
సోమవారం కాంప్లెక్స్ కూడలి నుండి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడానికి ప్రయత్నించగా పోలీస్ యంత్రాంగం నిరాకరించడంతో అంగన్వాడిలు కలెక్టర్ కార్యాలయం కూడలి వద్ద ప్రధాన రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈరోజు చేపట్టి నిరసన కార్యక్రమం ఆరంభం మాత్రమేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మాల మన్మధరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన్మధరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిఅధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదనీ, అంగన్వాడీలకు గ్రాట్యుటి అమలు చేయాలని ,సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలుకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదనీ అంగన్వాడీలు అప్పు చేసి సెంటర్లు నడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆదివారం విజయవాడకు బయలుదేరుతున్న అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ను, సంఘ నాయకులను అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం ఎంతో దుర్మార్గమని, ఇటువంటి అణిచివేత మార్గాలను ప్రభుత్వం ఎంచుకోవడం ఎంతో సిగ్గుచేటని, తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఇటువంటి నిర్బంధాలకు గురిచేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంగన్వాడీలపై రోజు రోజుకి పని ఒత్తిడి అధికమవుతుందని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జ్యోతిలక్ష్మి అన్నారు. ఆమె మాట్లాడుతూ
గత ఐదు సంవత్సరాలుగా TA లు చెల్లించడం లేదనీ,రకరకాల యాప్ ల ను తీసుకొని వచ్చి పని భారాన్ని పెంచారనీ, అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదనీ, అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేటికీ చెల్లించడం లేదనీ విమర్శించారు. సెంటర్లను బలోపేతం చేయడానికి నిధులను పెంచి అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్య పాలవుతున్నారు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అంగన్వాడి వర్కర్స్ అమలు కావడం లేదనీ,అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలనీ, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలనీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు సరళ అన్నారు. ఆమె మాట్లాడుతూవైయస్సార్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలని ,గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని,2017 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న టీఏ లను వెంటనే చెల్లించాలనీ లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలనీ,ఆయిల్ కందిపప్పు క్వాంటిటీ పెంచాలనీ,వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలినీ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img