Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కుష్టి వ్యాధి పై ఇంటింటి సర్వే

విశాలాంధ్ర బొమ్మనహళ్: కుష్టి వ్యాధిపై ఇంటింటి సర్వే ను గురువారం మండలంలోని దేవగిరి గ్రామంలో వైద్య సిబ్బంది ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వే డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుందన్నారు వైద్య సిబ్బంది మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారని అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలన్నారు కుష్టి వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధి నయం చేయడానికి సులభంగా ఉంటుందన్నారు కుష్టి వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు యుగంధర్ రుక్మిణి ఆరోగ్య కార్యకర్తలు గోవర్ధన్ నాగేంద్ర ఏఎన్ఎం విజయలక్ష్మి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img