Monday, June 5, 2023
Monday, June 5, 2023

కసాపురం మండలంలో హుండీ లెక్కింపు

విశాలాంధ్ర-గుంతకల్లు : పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయ ఈవో వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో హుండీలు తెరచి లెక్కింపు చేశారు.అందులో రూ.43,10,744 /-లు, అన్నప్రసాదం వితరణ హుండీ ద్వారా రూ.52,260 /-లు నగదు, బంగారు-000-004 గ్రాములు -000 మిల్లీ గ్రాములు, వెండి-001 కేజీ -309 గ్రాములు – 000 వచ్చిందని తెలిపారు.(ఈ మొత్తము తేది.07.02.2023 నుండి తేది.27.03.2023 వరకు అనగా 49 రోజులకు గాను వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమములో ఆలయ దర్మకర్త సుగునమ్మ, దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షకులు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, కసాపురం బ్రాంచ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది,
ఆర్.టి.సి. సేవాసమితి, వీరభద్ర సేవాసమితి సభ్యులు, బళ్ళారి వారు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img