Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఈనెల 15,16,17 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష

విశాలాంధ్ర-గుంతకల్లు : అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం కోసం ఈనెల 15,16,17 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు బుధవారం సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధ్యత సంఘం నాయకులు వెంకటేష్ ,ఎస్ ఎండి గౌస్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం కోసం ఈనెల 15, 16 ,17 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు సామూహిక సత్యాగ్రహం అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 40 లక్షల అగ్రిగోల్డ్ బాధితులు ప్రజా సంఘాలతో కలిసి పోరాటం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య,రామకృష్ణ, మల్లయ్య, ఉమ్మర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img