Friday, April 19, 2024
Friday, April 19, 2024

గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం

జీవీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డుంగవత్ బాలాజీ నాయక్


విశాలాంధ్ర – ధర్మవరం : గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని త్వరలో ప్రతి గిరిజన తండాలో పర్యటించి నిర్ణయం తీసుకొని పోరాటాలను సలుపుతామని జీవి ఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డు oగవత్ బాలాజీ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ2019లో చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పడుతుందనీ హెచ్చరించారు.త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని రాష్ట్రంలోని యావత్ గిరిజన ప్రజానీకం తీవ్ర విచారణ వ్యక్తం చేస్తుందని, గతంలో చంద్రబాబునాయుడు గారు చేసిన పొరపాటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారని, గతంలో ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ప్రస్తుతం ఆయనను గతంలో జరిగిన ఎన్నికల్లో గిరిజనులు ఎక్కడ కూర్చోబెట్టినారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కాబట్టి భవిష్యత్తులో జరగనున్నటువంటి 2024వ సంవత్సర ఎన్నికల్లో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తక్షణం 52 జీవోను రద్దు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని, లేకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంధకారమేనని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img