15 న జింఖానా గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ
అగ్రీగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు,
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి.
అనంతపురం అర్బన్: అగ్రిగోల్డ్ బాధితులుకు న్యాయం జరుగకపోతే ప్రభుత్వంపై సమర శంఖం పురిస్తామని ఎపి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర రెడ్డి భవన్ లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలసి 15 న విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరుగనున్న భారీ బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు తమ పిల్లల భవిషత్ కోసం అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేశారని సంస్థ చేసిన మోసానికి వారంతా ఆర్థిక సంక్షోభంలోనికి కూరుకుపోయారని విచారం వ్యక్తం చేశారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే
అగ్రిగోల్డ్ ఏజెంట్లు,బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సీఎం అయ్యాక మాట తప్పి బాదితుల ఉసురు పోసుకుంటున్నాడని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొచించాలన్నారు.అగ్రిగోల్డ్ సంస్థ దివాలా తీసినట్టు యాజమాన్యం ప్రకటించడంతో ఏజెంట్లు, ఖాతాదారులు అనేకమంది ఆత్మహత్యల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.అగ్రిగోల్డ్ బాదితులకు న్యాయం జరుగకపోతే పాలక ప్రభుత్వాలపై సమర శంఖం పూరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాదితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర నాయకులు ధనుంజయ, భాగ్యలక్ష్మి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య ,నారాయణస్వామి,రమణ, సంతోష్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయ్ స్వామి,జిల్లా ఉపాధ్యక్షుడు వంశి,నాయకులు మనోహర్,మహేష్,రవి తదితరులు పాల్గొన్నారు.