Friday, April 26, 2024
Friday, April 26, 2024

చిత్త శుద్ధితో ఎమ్మెల్యే పనిచేస్తే… ప్రజలు సమస్యలు ఎందుకు చెబుతారు

పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చిత్తశుద్ధితో గుడ్ మార్నింగ్ చేస్తే ప్రజలు సమస్యలు ఎందుకు చెబుతున్నారని… టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం”ఇదేం కర్మ- మన రాష్ట్రానికి”కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 21, 22 వార్డులలో ర్యాలీ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, ఇన్చార్జిలతో కలిసి వారు ఇంటింటికి ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. వ్యవసాయం తర్వాత దేశంలో రెండవ స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేయుటలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చేనేతలను పట్టించుకున్న పాపాన పోలేదని, తూతూ మంత్రంగా కాకుండా, శాశ్వత పరిష్కారం కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిష్కరించలేకపోయారని దుయ్యబడ్డారు. ధర్మవరంలో అధికార పార్టీ అరాచకాలకు ప్రజలే చరమగీతం పాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్న విషయాలను జోడించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు గోడల పైన కూడా అతికించిన వైనం అందరినీ ఆకర్షించింది. గ్యాస్ ధర పెంపు, నిత్యవసర ధరలు పెరిగిపోయి, చేనేత ముడి సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో ప్రజల యొక్క బతుకు భారమైందని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం కూడా అర్హులైన వారందరికీ అందలేదని తెలిపారు. ముడి పట్టుకు రాయితీ విషయంలో ప్రభుత్వం ఇంకనూ స్పందించాల్సి ఉందని వారు తెలిపారు. తదుపరి రచ్చబండలో పాల్గొని, చేనేతలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు అంతంత మాత్రమే ఉన్నాయని తెలిపారు. పట్టణంలో వైసీపీ నాయకులు అన్నిచోట్ల దందాలకు, వసూళ్లకు పాల్పడుతున్న వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం గౌడ్, కమతం కాటమయ్య, పరిసే సుధాకర్, పని కుమార్, మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, బోయ రవిచంద్ర, బిరే శ్రీనివాసులు, గొట్లురు అనిల్, సాహెబ్బి, బిబి లతోపాటు అధిక సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img